నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ధర్నాతో చలనం వచ్చి, ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయమని, కానీ కేంద్రం తెలంగాణాలో ఎంత మొత్తంలో ధాన్యం కొంటారో స్పష్టత ఇవ్వడం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనను రెండోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ వానాకాలం సీజన్ లో కావాలని ఎఫ్ సిఐ గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని తరలించడంలేదన్నారు. రైల్ వే వ్యాగన్ లను ఇవ్వడం లేదని, కావాలని ఎఫ్ సిఐ తాత్సరం చేస్తుందన్నారు. అందుకే ఈ వానాకాలం ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుతం వానలు పడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కానీ ఇక్కడి బిజెపి వాళ్ళు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అన్నారు. అడ్డగోలు ప్రకటనలు చేస్తున్నారు… ఇప్పటికైనా బిజెపి, కాంగ్రెస్ నాయకులు భాద్యతతో వ్యవహరించాలన్నారు. వచ్చే యసంగిలో ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేలా ఇక్కడి బిజెపి నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
Gutta Sukender Reddy press meet