Monday, December 23, 2024

నల్లగొండలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది: గుత్తా

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని శాసన మండలి ఛైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో ఆదివారం తన నివాసంలో గుత్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ…”ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతీసారి మొండి చెయ్యి చూపిస్తున్నారు. మోడీ పర్యటనలో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. గవర్నర్ తమిళిసై ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్ ఆవేదన ఏంటో అర్థం కావడం లేదు. రేపు నల్గొండ జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పర్యటించబోతున్నారు. పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌ను ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేస్తారు” అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News