- Advertisement -
నల్లగొండ: సిఎం కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత ప్రధాని నరేంద్ర మోడీకి లేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేయడంతో గుత్తా స్పందించారు. కెటిఆర్‌ను సిఎం చేయాలంటే మోడీ ఆశీర్వాదం అక్కర్లేదని విమర్శించారు. తెలంగాణలో వెంటిలేటర్‌పై ఉన్న బిజెపిని బతికించుకునేందుకు మోడీ విమర్శలు చేస్తున్నారని చురకలంటించారు. అవినీతిపరులు తన పక్కన కూర్చోలేరని మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇడి, సిబిఐ కేసులున్న వారినే బిజెపిలో చేర్చుకుంటున్నారని గుత్తా దుయ్యబట్టారు.
Also Read: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు పుర్కాయస్థకు 7 రోజుల పోలీసు రిమాండ్
- Advertisement -