Sunday, December 22, 2024

నాలుగు రోజులైన సిఎం ఎవరో చెప్పని పరిస్థితి కాంగ్రెస్‌ది: గుత్తా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా బిజెపి మార్పులేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఫలితాలు వచ్చి న తరువాత కూడా నాలుగు రోజులైనా సిఎంను తేల్చలేని స్థితిలో కాంగ్రెస్‌కు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నాయకులది అయోమయ స్థితిలో ఉన్నారని గుత్తా చురకలంటించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని గుత్తా ధీమా వ్యక్తం చేశారు. వామపక్షాలు లేకుండా కెసిఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చామన్నారు.

Also Read:సన్‌రైజర్స్ ఔట్… ప్లేఆఫ్‌కు గుజరాత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News