Thursday, January 23, 2025

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్: గుత్తా

- Advertisement -
- Advertisement -

Gutta Sukhender reddy comments on Komati Reddy brothers

తెలంగాణ: నల్లగొండ జిల్లా ఉద్యమాల కిల్ల అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గురువారం గుత్తా మీడియాతో మాట్లాడారు. రాజీనామా అంశం కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి పరిధిలోనే ఉందని, రాజీనామా అంశాన్ని సాగదీసే అవకాశం కనిపిస్తోందన్నారు. రాజీనామా అనే అంశం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ గా మారిందని ఎద్దేవా చేశారు. ఎంఎల్‌ఎగా ఉండి అభివృద్ధి చేయని వ్యక్తి రాజీనామా చేసి ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో మళ్లీ టిఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతుందని, మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రశంసించారు.

డీలిమిటేషన్ విభజన చట్టంలో ఉందని, కేంద్రం కావాలనే చేయడంలేదని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు విని పోలవరం ముంపు మండలాలను బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీలేరు ప్రాజెక్టు, ఏడు మండలాలను అన్యాయంగా ఎపిలో కలిపారని, పోలవరం ప్రాజెక్టు తెలంగాణకే కాదని, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు సమస్యగా మారిందన్నారు. పోలవరం అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని సూచించారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్తది కాదని, రాజకీయాలకు మండలం ఏర్పాటుకు సంబంధం ఎలా ఉంటుందని గుత్తా ప్రశ్నించారు. కాళేశ్వరం ముంపు ప్రకృతి వైఫరీత్యమేనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News