Tuesday, November 5, 2024

నేను లేదా నా కుమారుడు ఆ ఎన్నికలలో పోటీ చేస్తాం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం గుత్తా మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎంఎల్‌ఎలతో భేదాభిప్రాయాలు ఉండడంతో కొందరు పార్టీ వీడుతున్నారని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికలలో తాను లేదా తన కుమారుడు ఎంపిగా పోటీ చేస్తారని చెప్పారు. ఈ వయసులో పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని, అవసరమైతే బిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇప్పుడే పోటీ చేసేవాడినని పేర్కొన్నారు.

పక్క పార్టీలోకి వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం తనకు లేదని, ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోందని, మా పార్టీ వాళ్లే మాకు ఇబ్బందులు తీసుకవస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పని అని గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో కూడి అదే జరుగుతోందని, కెసిఆర్ విజయం కోసం అందరూ కలిసి పని చేయాలని బిఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. మూడోసారి కెసిఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని గుత్తా ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News