Monday, December 23, 2024

గాంధీ చూపిన మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం: గుత్తా

- Advertisement -
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని శాసస మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడారు. ఉద్యమ నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కారణంగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. కెసిఆర్ పాలన దక్షతతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుత్తా కొనియాడారు. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని మెచ్చుకున్నారు. అభివృద్ధి పథంలో వేగంగా పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు సహకారం అందించాలని గుత్తా కోరారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News