Tuesday, November 5, 2024

గుత్తా పొద్దుతిరుగుడు పువ్వు, ఊసరవెల్లి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : వ్యవసాయానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరా కావడం లేదని, 11 గంటలకన్నా ఎక్కువ రావడం లేదని తాను బండసోమారం సబ్ స్టేషన్ నుండి చెప్పిన మాటలతో బెదిరిపోయిన ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 350 సబ్ స్టేషన్ల నుంచి లాగ్ బుక్స్ గుంజుకెళ్లిందని, వాటిని ప్రగతి భవన్‌కు తరలించారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

శుక్రవారం నల్లగొండలో ఆయన విలేఖరులతో మాట్లాడుతు 24గంటల విద్యుత్తు సరఫరా కావడం లేదని తాను నిరూపించడంతో మంత్రి కెటిఆర్‌కు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పరేషాన్లో ఉండని ఎద్దేవా చేశారు. నల్లగొండ, సిరిసిల్ల ఎక్కడైనా ఉచిత విద్యుత్‌పై చర్చకు కెటిఆర్ రావాలని సవాల్ విసురుతున్నానన్నారు. పొద్దుతిరుగుడు పువ్వులా పూటకో పార్టీ మారే వారి గ్రామంలో కూడా తాను సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశానంటూ పరోక్షంగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శించారు.

ఊసరవెల్లి రంగులు మారినట్లుగా మూడు పార్టీలు మారిన గుత్తా నాకు వ్యవసాయం తెలియదంటారా అంటూ వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. తన చేతిలో ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో 30వేల ఓట్లతో చిత్తుగా ఓడిన గుత్తా, కాంగ్రెస్‌లో చేరి తన కాళ్లు పట్టుకుని బతిలాడితే రెండుసార్లు ఎంపీగా గెలిపించామని, కెసిఆర్‌కు అమ్ముడుపోయి బిఆర్‌ఎస్‌లో చేరి మూడువేల కోట్లు సంపాదించుకున్నాడని, గుత్తాకు మూడువేల కోట్లున్నా నూరు ఎకరాలున్నా నాకాళ్ల కిందకు కూడా పనికిరావంటూ విమర్శించారు.

మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని, మేము చేసేదే చెప్తామని, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. కొల్లాపూర్‌లో ఈనెల 20న జరిగే కాంగ్రెస్ సభలో ప్రియాంంకా గాంధీ మహిళ డిక్లరేషన్ ప్రకటిస్తారని, త్వరలోనే బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వికలాంగులకు 5 వేల పెన్షన్ ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News