Thursday, December 26, 2024

ఖాకీ కామ పిశాచి… బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన కూతురు ఆలనా పాలనా చూసుకునేటందుకు బాలిక తీసుకొచ్చి ఆమెపై కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుత్తికి చెందిన వై రమేష్ అనే వ్యక్తి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. భార్యతో కలిసి అనంతరం జిల్లా కేంద్రంలో ఉంటున్నాడు. ఈ దంపతులకు పాప ఉండడంతో బాగోగులు చూసేందుకు ఓ బాలిక ఇంటికి తీసుకొచ్చాడు. భార్య ఇంట్లో లేని సమయంలో బాలికపై అతడు పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంలో అబార్షన్ కూడా చేయించాడు. బాలిక శారీరకంగా వేధించడంతో లాఠీతో పలుమార్లు కొడుతూ వైరుతో గొంతు నులిమి ఇబ్బందికి గురిచేశాడు. అతడి వేధింపులకు తాళలేక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. వెంటనే వారు వెళ్లి స్థానిక డిఎస్‌పికి ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు సదరు కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: కాంగ్రెస్‌కు ఊహించని షాక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News