Friday, December 20, 2024

తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..

- Advertisement -
- Advertisement -

తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం
తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక సమర్పించారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు నివేదిక అందజేశారు. అనంతరం ఈ రాత్రికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. అంతకుముందు అమిత్‌షాతో భేటీ సందర్భంగా.. ఆమె తెలంగాణలో ప్రోటోకాల్ వివాదం, ప్రస్తుత పరిస్థితులను వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలతో అమిత్‌షాతో చర్చించానని చెప్పారు. అమిత్‌షాతో చర్చించిన విషయాలు బటయకు చెప్పలేనని అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తానని చెప్పారు. తెలంగాణలో తాను రైలు, రోడ్డు మార్గంలో మాత్రమే ప్రయాణించగలను అని అన్నారు. ఎందుకో మీరే అర్థం చేసుకోండని మీడియాతో అన్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతానని చెప్పారు. మేడారంకు రోడ్డు మార్గంలోనే వెళ్లానని చెప్పారు. భద్రాచలంకు కూడా రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లనున్నట్లుగా తెలిపారు. భద్రాద్రి జిల్లాలోనూ గిరిజన ప్రాంతాలను సందర్శిస్తానని చెప్పారు.

తెలంగాణలో ఎవరూ తన ప్రయాణాన్ని ఆపలేరని అన్నారు. మేడారంకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదని తాను చెప్పలేదని.. సీతక్క చెప్పారని అన్నారు. యాదాద్రిలో తనకు మర్యాద ఇవ్వలేదని మీడియా రాసిందని.. తాను అనలేదని తెలిపారు. తన విషయంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని చెప్పారు. తాను అంరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తినని తెలిపారు. రాజ్‌భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సిఎం, మంత్రులు, సిఎస్ రాజ్‌భవన్‌కు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. తనతో సమస్య ఉంటే ఎవరైనాప వచ్చి చర్చించవచుచ అని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నట్లుగా చెప్పారు. యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ తనను కలవలేదని చెప్పారు. యాదాద్రికి తాను బిజెపి వ్యక్తిగా వెళ్లానని వాళ్లు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. రెండేళ్లలో తాను బిజెపి నాయకులను కేవలం ఒకటి, రెండుసార్లే కలిశానని తెలిపారు. తమిళిసైని కాకపోయినా రాజ్‌భవన్‌ను గౌరవించాలన్నారు. తాను ఎవరినీ విమర్శించట్లేదని చెప్పారు. తెలంగాణలో రాజ్‌భవన్, గవర్నర్ విషయంలో ఏం జరుగుతుందో మాత్రమే చెబుతున్నానని అన్నారు.

Guv Tamilisai met Amit Shah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News