మన తెలంగాణ/హైదరాబాద్ : నేపాల్ క్లబ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తిరుగుతుంటే అనేక అనుమానాలు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. ఈ అనుమానాలపైస్పష్టత ఇవ్వాల్సిన అవసరం రాహుల్‌పై ఉందన్నారు. ఆ క్లబ్‌లో రాహుల్ డ్రగ్స్ తీసుకులేదని నిరూపించుకోవాలంటే టెస్ట్‌లకు సిద్దపడాలన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ విసిరిన వైట్ ఛాలెంజ్‌కు రాహుల్ సిద్దమేనా? అని ప్రశ్నించారు. దమ్ముంటే టిఆర్‌ఎస్ చేసిన సవాల్‌ను కాంగ్రెస్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
గురువారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ మాటలతో దేశ ప్రతిష్టకు ముప్పు వాటిల్లిన్నట్లుగా స్పష్టమవుతోందన్నారు. నేపాల్ క్లబ్‌లో రాహుల్‌గాంధీ చైన్ రాయబారితో మాట్లాతున్నారని పిసిసి రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారన్నారు. ఆ రాయబారితో రాహుల్ ఏం మాట్లాడారన్నారు. దేశ రహస్యాలు ఏమైనా చైనాతో రాహుల్ పంచుకున్నారా? అని బాలరాజు నిలదీశారు. రాహుల్ గాంధీ ఒక మామూలు వ్యక్తి కాదని…. దేశాన్ని ఏలిన కుటుంబం నుంచి వచ్చిన వారసుడన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ దేశద్రోహో కాదో తానే నిరూపించుకోవాలన్నారు. ఇందులో రాహుల్ శైలి చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితేనే అసలు విషయాలు వెలుగుచూస్తాయన్నారు. ముందుగా దేశ రహస్యాలు శత్రు దేశానికి చేరవేసినట్లుగా ఆయన కేసు నమోదు చేయాలన్నారు. చైనా అంబాసిడర్ తో రాహుల్ ఉన్నది నిజమే అని రేవంత్ అంటుంటే… కాదని ఆ పార్టీలోని ఇతర నేతలు అంటున్నారన్నారు. ఒకవేళ రేవంత్‌ది అబద్ధమైతే పిసిసి అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని బాలరాజు డిమాండ్ చేశారు.