Friday, December 20, 2024

మూగ తల్లి, కూతురుపై 8 మంది అత్యాచారం… ప్రైవేట్ పార్ట్‌లో కారం చల్లి…

- Advertisement -
- Advertisement -

దిస్‌పూర్: 20 రోజుల క్రితం ఎనిమిది మంది ఇంట్లోకి చొరబడి మూగ మహిళ, ఆమె కూతురుపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన అస్సాం రాష్ట్రం గౌహతిలోని సత్‌గామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తాల్‌తాలా ప్రాంతంలో 22 ఏళ్ల కూతురు ఆమె మూగ తల్లితో కలిసి జీవిస్తోంది. ఆమె కూతురు వివాహం జరిగినప్పటికి దంపతుల మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. ఆమె కూతురు అదే గ్రామంలో అరుణ్ ప్రధాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అరుణ్ ప్రదాన్,  ప్రియురాళ్ల కుటుంబాల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

Also Read: గడ్డి పరకలను గడ్డపారలుగా మార్చిన యోధుడు

దీంతో అరుణ్ కుమారుడు అమిత్ తన ఏడుగురు అనుచరులతో ఆమె ఇంట్లో చొరబడి తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది అత్యాచారం చేశారు. అనంతరం వారి మర్మాంగాలపై కారం పొడి చల్లి పారిపోయారు. వాళ్లను వెంటనే ఆస్పత్రికి స్థానికులు తరలించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పస్తుతం పోలీసులు ఐపిసి 92/23, 456, 294, 354, 354 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నలుగురు నిందితులు అమిత్ ప్రదాన్, బిమల్ చెత్రి, చయా ప్రదాన్, సంధియా సోనార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News