Monday, December 23, 2024

’కింగ్‌స్టన్’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సంగీత దర్శకుడు, హీరో -జివి ప్రకాష్ కుమార్ ప్రస్తుతం కొత్త దర్శకుడు కమల్ ప్రకాష్‌తో కలసి ’కింగ్‌స్టన్’ పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో దివ్య భారతి కథానాయికగా నటిస్తుండగా ఆంటోనీ, చేతన్, కుమారవేల్, సాబుమోన్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో జి.వి. ప్రకాష్ కుమార్ కింగ్‌స్టన్ స్క్రిప్ట్ విన్న తర్వాత.. ఇది పిల్లల నుండి పెద్దల వరకు ప్రేక్షకులని మెప్పిస్తుందని నమ్మకం కలిగి ఈ సినిమా చేస్తున్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News