Saturday, December 21, 2024

“డియర్” షూటింగ్ పూర్తి

- Advertisement -
- Advertisement -

జివి ప్రకాష్ కుమార్-ఐశ్వర్య రాజేష్  ప్రధాన పాత్రలలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న “డియర్” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ‘డియర్’ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చినప్పటినుంచి అంచనాలు పెరిగాయి. దానికి కారణం ‘మ్యూజికల్ కింగ్’ జి.వి. ప్రకాష్ కుమార్, అద్భుతమైన నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారి కలసి నటించడం. నట్ మెగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ తిరిపురేణి, అభిషేక్ రామ్ శెట్టి, పృథ్వీరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘సేతుమ్ ఆయిరమ్ పొన్’ఫేం ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించడంలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వ ప్రావీణ్యం, మంచి ఎగ్జిక్యూషన్ పట్ల నిర్మాతలు సంతోషంగా వున్నారు.  ప్రీప్రొడక్షన్ దశలోనే అనుకున్న ప్రకారం కేవలం 35 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తయింది. ‘డియర్’ చిత్రాన్ని చెన్నై, ఇడుక్కి, కూనూర్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్  చేస్తారు.

ఈ చిత్రంలో జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్‌లతో పాటు, కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, ‘బ్లాక్ షీప్’ నందిని, పలువురు స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. రుకేశ్ ఎడిటింగ్‌ను, ప్రగదీశ్వరన్ ఆర్ట్‌వర్క్‌ను, అనూష మీనాక్షి కాస్ట్యూమ్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ‘రాప్’ ఐకాన్ అరివు ఈ చిత్రంలో ఒక పాటను స్వయంగా రాసి, పాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News