Thursday, January 23, 2025

కన్నావి రాజకీయ వ్యాఖ్యలు: జివిఎల్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కన్నా లక్ష్మీ నారాయణకు బిజెపి సముచిత స్థానం కల్పించిందని జివిఎల్ నరసింహరావు తెలిపారు. బిజెపికి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంతో పాటు జివిఎల్ పై కన్నా పరోక్ష విమర్శలు గుప్పించడంతో జివిఎల్ రీకౌంటర్ ఇచ్చారు. సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సరికాదని హెచ్చరించారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. అధిష్టానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు నడుస్తున్నారని, వీర్రాజు వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎంపిగా తన బాధ్యతకు లోబడే తాను పని చేశానని జివిఎల్ వివరించారు.

సోము వీర్రాజు అధ్యక్షుడైన తరువాత పార్టీ పరిస్థితులు మారాయని, సోము వీర్రాజు పార్టీని సొంత సంస్థలా నడుపుతున్నారని కన్నా విమర్శించారు, సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేశానని కన్నా వివరించారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని,

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News