Thursday, April 3, 2025

ఆ రెండు పత్రికలపై రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన జివిఎల్

- Advertisement -
- Advertisement -

GVL NARSIMHA RAO

న్యూఢిల్లీ: ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలపై బిజెపి ఎంపీ జివిఎల్‌ నరసింహరావు రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తప్పుడు వార్తలు ప్రచురించారని అందుకే ప్రివిలేజ్ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా సాయం చేస్తున్నా.. ఆప్ర , తెలంగాణ ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయని, మంత్రి కెటిఆర్ హద్దు మీరి ప్రధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి అంటే భయంతోనే కెటిఆర్ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబపార్టీల నుంచి ముప్పు ఉందని, కుటుంబ పార్టీల పాలన దూరం చేసేలా.. 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని మోడీ ఖరారు చేశారని జివిఎల్‌ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News