Monday, December 23, 2024

ప్రేమపెళ్లి…. భార్య ఎక్కువగా షాపింగ్ చేస్తుందని చంపించాడు

- Advertisement -
- Advertisement -

భోపాల్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు… భార్య షాపింగ్‌కు విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తుందని కిరాయి హంతకులతో ఆమెను భర్త హత్య చేయించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అజయ్ అనే వ్యక్తి మొదటి భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. దుర్గావతి అనే మహిళ పరిచయం కావడంతో ఆమెతో అజయ్ ప్రేమలో పడ్డారు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో 2017లో ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 13న విక్కీ ఫ్యాక్టరీ సమీపంలో దుర్గావతి తన సోదరుడు సందేశ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో దుర్గావతి మృతి చెందగా సందేశ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తొలుత రోడ్డు ప్రమాదం అని భావించారు. దుర్గావతి తన సోదరుడు సంజయ్‌తో కలిసి బైక్‌పై గుడికి వెళ్లి వస్తుండగా లోడ్ లారీ ఢీకొట్టిందని అజయ్ చెప్పాడు. దీంతో ఆ ప్రాంతాలలో ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించగా ఎక్కడ లారీ కనిపించలేదు. మళ్లీ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కారు కావచ్చని అనుమానంగా చెప్పాడు. వెంటనే పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో భర్త నిజాలు ఒప్పుకున్నాడు. దుర్గావతి ఎక్కువగా షాపింగ్‌లకు డబ్బులు ఖర్చు పెడుతుండడంతో రూ.2.5 లక్షలు సుఫారీ ఇచ్చి ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేయించానని భర్త నిజాలు బయటపెట్టాడు. వెంటనే భర్తతో సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News