Thursday, January 9, 2025

వైద్యురాలిపై డాక్టరు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

భోపాల్: వైద్యురాలిపై డాక్టరు అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గజ్రారాజా మెడికల్ కాలేజీలో ఓ యువతి పిజి చదువుతోంది. ఆమెకు వైద్యుడు ఫోన్ చేసి హాస్టల్ నుంచి బయటకు రమ్మని కబురు పంపాడు. అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లిన తరువాత ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. వెంటనే యువతి కంపు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి వెంటనే డాక్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2024 అగస్టు 9న కోల్‌కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యారినిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News