- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో టివి షోలో క్రైమ్ చూసి తన భార్యను భర్త చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కంపూ ప్రాంతంలో ప్రదీప్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. గత కొన్ని రోజులగా దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యను చంపి అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రోడ్డు ప్రమాదంలో తనకు కూడా గాయలైనట్టు పోలీసులకు వివరణ ఇచ్చాడు. ఆమె బంధువులతో అనుమానం రావడంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్యచేశానని ఒప్పుకున్నాడు. శవ పరీక్షలో మహిళను చిత్రహింసలకు గురిచేయడంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. వెంటనే భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -