Tuesday, January 21, 2025

ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్, సంధూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం మరో ఇద్ద రు నూతన కమిషనర్లను నియమించారు. వీరి పేర్లను కేంద్రం ప్రకటించింది. సీనియర్ మాజీ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కొత్త కమిషనర్లుగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యపు సెలక్షన్ కమిటీ ఎంపిక చే సింది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమి త్‌షా కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కూ డా సభ్యులుగా ఉన్నారు. ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తన అసమ్మతిని లిఖితపూర్వకంగా తె లియచేసింది. ఇప్పుడు కమిషనర్లుగా ఎంపిక చే సిన వారి పేర్లను ఆ తరువాత ప్రధాని మోడీ, అ ధీర్ రంజన్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సం ఘం ఇప్పుడు కేవలం ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరి సారధ్యంలోనే పనిచేస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఇటీవలే ఇద్దరు కమిషనర్లలో అనూప్ పాండే గత నెల 14న రిటైరయ్యారు, కాగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. దీనితో అత్యవసరంగానే వీరి స్థానాలను భర్తీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కమిషనర్లుగా నియమితులు అయిన వారిలో జ్ఞానేష్ కుమార్ 1983 బ్యాచ్ కేరళ ఐఎఎస్ కేడర్ అధికా రి. ఆయన హోం మంత్రిత్వశాఖ సెక్రెటరీగా వ్యవహరించినప్పుడే ఆర్టికల్ 370 రద్దు ప్రక్రియను పర్యవేక్షించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కమిషనర్‌గా కూడా ఉన్నారు. ఇక సంధూ ఉత్తరాఖండ్ ఐఎఎస్ కేడర్ అధికారి, ఆయన గతంలో పలు కీలక ప్రభుత్వ పదవుల లో పనిచేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి గా, జాతీయ రహదారుల అధీకృత సంస్థ ఛైర్మన్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఎన్నికల కమిషనర్ల నియామక, ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు దిగనుంది. ఈ దశలోనే ఒక్కరోజు ముందు నియామకం జరిగింది.
చీఫ్ జస్టిస్ ప్రమేయం లేదు.. ప్రభుత్వానిదే పై చేయి : కాంగ్రెస్
కమిషనర్ల ఎంపిక ప్రక్రియ అంతా తప్పులతడకే
ఇద్దరు కమిషనర్ల ఎంపిక ప్రక్రియ సరైన పద్ధతిలో లేదని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. పలు ప్రశ్నలను సంధిస్తూ , ఇప్పుడు జరిగిన తంతుపై కాంగ్రెస్ తన అసమ్మతిని నోట్ రూపంలో వ్యక్తపర్చిందని సమావే శం తరువాత ఆయన తమ నివాసంలో విలేకరులకు తెలిపారు. ఎంపిక ప్రక్రియలో అంతాగందరగోళం ఉందని, పైగావ్యవహరించిన తీరు పలుఅనుమానాలకు దారితీస్తోందని తెలిపారు. ఈ రెండు పోస్టులకు ముందుగా ప్రతిపాదనకు వచ్చిన మొత్తం 212 మందిపేర్లను తమకు ఇ చ్చారని, తరువాత ఆరుగురి జాబితాను తనకు ఇచ్చారని , వీరిలోఇద్దరిని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారని వివరించారు.
చీఫ్ జస్టిస్‌ లేకుండా ఎంపిక అనుచితం
సెలక్షన్ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి అవసరం లేకుం డా చేసినచట్టం తీసుకురావడాన్ని కాంగ్రెస్ నేత అధీర్ రంజ న్ తప్పుపట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఖచ్చితంగా ఇటువంటి కమిటీలో సభ్యులుగా ఉండాల్సిన అవసరం లే దా ? అని ప్రశ్నించారు. చీఫ్ జస్టిస్‌ను తప్పించడం, కమిటీ లో కేంద్ర హోం మంత్రికి, నామమాత్రంగా ప్రతిపక్షనేతను సభ్యుడిగా చేయడం వల్ల ఈ కమిటీ ఎటువైపు మొగ్గుగా ఉం టుందని నిలదీశారు. కేవలం తాను ఎంపిక చేసుకున్న వారి నే ఎలక్షన్ కమిషనర్లుగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చే సుకుంటే ఇక కమిటి సమావేశం ఎందుకు? ఇదంతా మొ క్కుబడికేనా అని ప్రశ్నించారు. గత ఏడాది ప్రభుత్వం సభ ల్లో నిరంకుశంగా వ్యవహరించి చీఫ్ జస్టిస్‌ను కమిటీ నుంచి తప్పించే బిల్లును ఆమోదింపచేసుకుందని విమర్శించారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామకం తరువాత ఆయన రాజీనామా అంతా కూడా మెరుపువేగంతోనే జరిగిందని తెలిపారు. ఇది తాను చెపుతున్నది కాదని , ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య అని లైటెనింగ్ స్పీడ్ అనేపదం వాడారని తెలిపారు. ఏది ఏమైనా ఎన్నికల దశలో పని జరగాల్సి ఉంది. జరిగింది. ప్రభుత్వం అనుకున్న విధంగా చేసింది. చేయగలిగింది అని చౌదరి వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు రూలింగ్ బేఖాతరు
ఇసి కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధాని, చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత ఉండాల్సిందేనని గత ఏడాది మార్చిలో సుప్రీంకో ర్టు రూలింగ్ వెలువరించింది. అయితే ఈ రూలింగ్ పరిధిలోకి రాకుండా కేంద్రం ఆ తరువాత ప్యానల్‌లో చీఫ్ జస్టిస్ లేకుండా చేస్తూ చట్టం తీసుకువచ్చింది. ఈ ఖాళీలో కేంద్ర మంత్రిని చేర్చారు. కాగా ఈ మార్పుతో ఎన్నికల సంఘం క మిషనర్ల ఈ నియామక ప్యానెల్‌లో తూకం చివరికి కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గింది. కాగా మారిన ఈ ప్యానెల్ ప్రక్రియను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ , కాంగ్రెస్ నేత జయఠాకూర్ సుప్రీంకోర్టులో సవా లు చేశారు. సంబంధిత పిటిషన్ విచారణ నేడు( శుక్రవా రం) విచారణకు రానుంది. కాగా దీనికి ముందు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ల నియామకం జరిగిపోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News