Monday, December 23, 2024

జ్ఞాన్‌వాపి మసీదు కేసు: కోర్టు ఆదేశించిన సర్వే ముగిసింది

- Advertisement -
- Advertisement -
GyanVapi Masjid Survey
రేపు నివేదిక సమర్పించాలి

లక్నో: వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు సముదాయానికి సంబంధించిన వీడియోగ్రాఫిక్ సర్వే సోమవారంతో ముగిసింది. కోర్టు నియమించిన అడ్వకేట్ కమీషనర్లు, ఇరుపక్షాల న్యాయవాదులు, అన్ని సంబంధిత పక్షాలు మరియు అధికారుల సమక్షంలో మూడు రోజుల తనిఖీ తర్వాత ప్రాంగణంలో సర్వే మధ్యాహ్నం సమయంలో ముగిసింది. వారణాసి కోర్టు గురువారం కాంప్లెక్స్ యొక్క వీడియో సర్వేని పునఃప్రారంభించవలసిందిగా ఆదేశించింది.  ఇన్‌ఛార్జ్ అధికారిపై పక్షపాత ఆరోపణల కారణంగా గత వారం అది నిలిపివేయబడింది. సర్వే నివేదికను మంగళవారం సమర్పించాలని పేర్కొంది.

కోర్టు నియమించిన కమిషన్ చర్య సోమవారంతో పూర్తయిందని వారణాసి పోలీసు కమిషనర్ సతీష్ గణేష్ మీడియాకు తెలిపారు. “మూడు రోజుల చర్య సోమవారం ముగిసింది. ప్రశాంత వాతావరణంలో ఇది జరిగింది. సహకరించిన కాశీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు. ఎలాంటి అనధికారిక ప్రకటనలను పట్టించుకోవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.

సోమవారం విచారణ పూర్తయిన తర్వాత వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ, “మే 17 (మంగళవారం) కోర్టులో నివేదిక సమర్పించే వరకు ఎవరూ ఏమి వెల్లడించకూడదని కోర్టు కమిషనర్ అన్ని పక్షాలకు ఆదేశాలు ఇచ్చారు. లోపల కనుగొనబడింది… కోర్టు మాత్రమే ఈ సమాచారం యొక్క సంరక్షకుడు(కస్టోడియన్) . ఎవరైనా మీకు ఏదైనా చెప్పినట్లయితే, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దానితో కోర్టు కమిషన్ కు సంబంధం లేదు.

అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా మసీదు వైపు “పక్షపాతంతో” వ్యవహరిస్తున్నారని ఆరోపించిన తరువాత, న్యాయస్థానం గురువారం ఇద్దరు అదనపు అడ్వకేట్ కమిషనర్లను- అడ్వకేట్ విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ సింగ్లను నియమించింది. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవికుమార్ దివాకర్ గురువారం మాట్లాడుతూ, కోర్టు నియమించిన కమిషన్ సర్వేను పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని మరియు “సంబంధిత చర్యలను” పర్యవేక్షించాలని డిజిపి, చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.

ఏప్రిల్ 8న, పిటిషనర్లను విచారిస్తున్నప్పుడు, వారణాసి కోర్టు వివాదాస్పద స్థలంలో మా శృంగార్ గౌరీ స్థలానికి సంబంధించిన సర్వేను నిర్వహించడానికి మిశ్రాను నియమించింది .  “చర్యకు సంబంధించిన వీడియోగ్రఫీని సిద్ధం చేసి” నివేదికను సమర్పించాలని  మిశ్రాకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News