Monday, December 23, 2024

అలహాబాద్ కోర్టుకు వెళ్లాలని జ్ఞానవాపి మసీదు కమిటీకి సుప్రీం సూచన

- Advertisement -
- Advertisement -

మసీదులో పూజలకు అనుమతిని వ్యతిరేకిస్తూ పిటిషన్

న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు గురువారం సూచించింది. జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ తరఫున న్యాయవాదులు నిజాం పాషా, ఫుజైల్ అహ్మద్ అయ్యూబీ సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించి అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై రిజిస్ట్రార్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్‌కు ఈ విషయం తెలియజేయగా, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా చీఫ్ జస్టిస్ వారికి సూచించారు.

“ ఉత్తర్వుల ముసుగులో స్థానిక అధికార యంత్రాంగం ‘తొందరపాటు’తో భారీ ఎత్తున పోలీస్ సిబ్బందిన మసీదు ప్రదేశంలో మోహరింప చేసిందని, మసీదు దక్షిణ దిశలో ఉన్న గ్రిల్స్‌ను తొలగించే పనిలో ఉందని ” పిటిషన్ దారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అవసరమైన ఏర్పాట్లకు వారం రోజుల గడువు ఉండగా, ఉత్తర్వులు రాగానే రాత్రికి రాత్రి మసీదు గ్రిల్‌ను తొలగించడానికి అధికార యంత్రాంగం సిద్ధం కావడంలో ఎలాంటి కారణం లేదన్నారు. ఉత్తర్వులకు వ్యతిరేకంగా మసీదు కమిటీ ప్రయత్నాలను నివారించడానికే కక్షిదారులు అధికార యంత్రాంగంతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News