Wednesday, January 22, 2025

జ్ఞానవాపి మసీదు వివాదంపై యోగి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు వివాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన చారిత్రాత్మక తప్పిదాన్ని ఒప్పుకుంటూ ముస్లిం పిటిషనర్లు ఒక తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని యోగి సూచించారు. ఈ వివాదానికి పరిష్కారా మార్గాన్ని ప్రభుత్వం కోరుకుంటోందని ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ కేసుకు సంబంధింది ఒక ప్రశ్నకు యోగి సమాధానమిస్తూ దాన్ని మసీదుగా పిలిస్తే అదో వివాదమవుతుంది. మసీదులో త్రిశూలం ఏం చేస్తోంది? అక్కడ దాన్ని మేము ఉంచలేదు. అక్కడ దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి అని చెప్పారు.
ముస్లింల తరఫు నుంచి ఒక ప్రతిపాదన రావాలని, చారిత్రక తప్పిదం జరిగిందని వారు ఒప్పుకోవాలని ఆయన చెప్పారు. ఈ తప్పిదానికి ఒక పరిష్కారాన్ని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

కాగా..యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ హర్షం వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యనాథ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News