Tuesday, April 1, 2025

యువతితో ప్రేమ వివాహం.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

యువతితో ప్రేమ వివాహం…. గొడవలు
మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమ వివాహంలో కలతలు రావడంతో ఓ జిమ్ ట్రైనర్ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…అంబర్‌పేట, పటేల్‌నగర్‌కు చెందిన వెంకటేష్ గౌడ్ కుమారుడు రాకేష్ గౌడ్(27) విద్యానగర్‌లో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే పరిచయమైన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో యువతి రాకేష్‌ను విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మానసికంగా వేదనకు గురైన రాకేష్ ఈ నెల 12వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తిరిగి ఇంటికి వచ్చిన రాకేష్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News