Thursday, January 23, 2025

బాలికకు ఫిట్‌నెస్ ట్రైనర్ల వేధింపులు

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : జిమ్‌కు వచ్చిన మైనర్ బాలికను ఫిట్‌నెస్ ట్రైనర్లు రాజుయాదవ్, రవియాదవ్‌లు బ్లాక్‌మెయిల్ చేసి బంగారం వెండితో పాటు 4 లక్షల రూపాయలు వసూళ్లు చేసిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం… బోయిన్‌పల్లి ధనలక్ష్మి కాలనీకి చెందిన ఓ మైన ర్ బాలిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్‌లోని ఫిట్‌నెస్ ఆర్‌జోన్ జిమ్‌కు కొన్ని రోజులుగా వచ్చి జిమ్ చేస్తుంది. అయితే అక్కడ జిమ్ ట్రైనర్లు రాజు, రవిలు బాలికతో పరిచయం పెంచుకున్నారు.

ఫిట్‌నెట్ పేరుతో బాలికతో సన్నిహితంగా ఉంటూ ఆమె వర్క్ అవుట్ చేస్తున్న క్రమంలో శరీర భాగాలను తాకుతూ రహస్యంగా ఫొటోలు తీశారు. అంతేకాకుండా వాటికి కొన్ని మార్ఫింగ్ చేసి బాలికను వేధించడం ప్రారంభించారు. దీంతో భయపడిపోయిన బాలిక 20 తులాల బంగారం, 60 తులాల వెండితోపాటు రూ. 4లక్షల నగదును బాలిక ఇచ్చింది. అయినా కూడా బాలికను మరింత డబ్బులు ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతానని బెదిరించడంతోపాటు తట్టుకోలేక బాలిక తల్లిదండ్రులకు తెలిపింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని ట్రైనర్లు రాజు, రవిని అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News