Monday, January 20, 2025

ఉద్యోగం కోల్పోయినా హెచ్1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు

- Advertisement -
- Advertisement -

ఉద్యోగం కోల్పోయిన హెచ్1 బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలోఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) నూతన నిబంధనలను విడుదల చేసింది. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన హెచ్1 బి వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు రెండు నెలల గ్రేస్ పిరియడ్ ఉంది. కొత్త నిబంధనావళి ప్రకారం లేఆఫ్‌కు గురైన వ్యక్తులు గ్రేస్ పిరియడ్ సమయంలో నాన్ ఇమ్మిగ్రంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే స్టేటస్ సర్దుబాటు , ఏడాది పాటు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ ) పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో మరికొన్ని మార్పులు చేస్తూ యూఎస్‌సీఐఎస్ నిబంధనలు విడుదల చేసింది. తమ తాజా చర్యతో హెచ్1 బీ వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బంది లేకుండా పొందవచ్చని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News