Monday, December 23, 2024

సెమీస్‌లో ప్రణయ్

- Advertisement -
- Advertisement -

H.S.Prannoy to semi-final in Malaysia Masters Badminton Tournament

సింధు ఇంటికి, మలేసియా మాస్టర్స్ టోర్నీ

కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోరులో ప్రణయ్ 2523, 2220 తేడాతో జపాన్‌కు చెందిన కాంటా సునెయామాను ఓడించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇక ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ప్రణయ్ మాత్రం ఒత్తిడికి గురి కాలేదు. చివరి వరకు నిలకడైన ఆటను కనబరుస్తూ వరుసగా రెండు సెట్లను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. అయితే మహిళల సింగిల్స్‌లో సింధుకు నిరాశ ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి తైజు ఇంగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి పాలైంది. మూడు సెట్ల సమరంలో సింధు 1321, 2112, 1221 తేడాతో పరాజయం చవిచూసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News