Monday, December 23, 2024

వచ్చే ఏడాది కోటాకు తగినన్ని హెచ్ 1బి వీసా దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: వచ్చే ఏడాదికి(2024) అవసరమైనన్ని వీసా దరఖాస్తులు అమెరికాకు అందినట్లు యుఎస్ సిటిజన్‌షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(ఎస్‌సిఐఎస్) ప్రకటించింది. వృత్తి నైపుణ్యం గల ఉద్యోగాలకు విదేశీ ఉద్యోగులు, కార్మికులను అమెరికన్ కంపెనీలు నియమించుకోవడానికి ఉద్దేశించిన హెచ్ 1బి వీసాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను అమెరికన్ టెక్ కంపెనీలు ప్రతి ఏటా నియమిస్తుంటాయి.

అమెరికన్ పార్లమెంట్ నిర్దేశించిన గరిష్ఠ పరిమితికి లోబడి ప్రతి ఏటా 65,000 హెచ్ 1బి వీసాలు, 20,000 యుఎస్ అడ్వాన్డ్ డిగ్రీ హెచ్ 1బి వీసాలు మాత్రమే మంజూరు చేయలాల్సి ఉంటుంది. ఈ పరిమితి ప్రకారం అవసరమైనన్ని వీసా దరఖాస్తులు అందినట్లు ఫెడరల్ ఏజెన్సీ తెలిపింది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. రానున్న కొద్ది రోజుల్లోనే ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారి ఆన్‌లైన్ అకౌంట్లకు నోటీసులు పంపుతామని ఏజెన్సీ తెలిపింది. గరిష్ఠ పరిమితి నుంచి మినహాయింపు పొందే దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని ఏజెన్సీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News