Friday, March 21, 2025

హెచ్ -బి వీసా నిబంధనల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

అమెరికా సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ శాఖ, హోమ్ లాండ్ సెక్యూరిటీ శాఖ అత్యంత కీలకమైన హెచ్ -1 బి వీసా కార్యక్రమంలో పలు మార్పులను ప్రవేశపెట్టాయి. నేటి నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చాయి. అమెరికాలోని పలు కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ కార్మికులను నియమించుకునేందుకు అవకాశం కల్పించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్ వే వ్యవస్థ( ఎఫ్‌ఎల్‌ఏజి) పాత అప్లికేషన్లను తొలగించే పని చేపట్టినట్లు మీడియా తెలిపింది. 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ నిపుణులైన భారతీయ కార్మికులు 70 శాతం హెచ్ -1బి వీసాలను అందుకున్నారు. రిజిస్ట్రేషన్ ఫఈజు కూడా పది డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. కాగా, అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇమిగ్రేషన్ విధానానికి సంబంధించి త్వరలో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న హెచ్ 1బి వీసా నిబంధనల మార్పుల్లో కొన్ని.ఐదు ఏళ్ల కంటే పాత రికార్డులు ఉంటే, వాటిని ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్ వే వ్యవస్థ (ఎప్ ఎల్ ఏజి) నుంచి తొలగిస్తారు. ఐదేళ్ల కంటే ముందు ఉన్న పాత కేసులను తొలగించాలని కంపెనీల యజామానులనూ ఆదేశించారు. గురువారం నుంచి ఈ ఆదేశం అమలు లోకి వస్తుంది.అలాగే తాత్కాలిక లేబర్ దరఖాస్తులను తొలగిస్తారు. అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ శాఖ కింద పనిచేసే యుఎస్ సిటిజన్ షిప్,ఇమిగ్రేషన్ శాఖ ఉద్యోగులకోసం కొత్త అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తోంది. గతంలో పలు కంపెనీల యజమానులు ఒక వ్యక్తికోసం
దరఖాస్తు చేసే వీలు ఉంది. కానీ కొత్తవ్యవస్థలో దరఖాస్తుదారులు అందరికీ సమాన అవకాశం ఇస్తుంది. ఎంతమంది యజమానులు అప్లికేషన్ లు సమర్పించారన్నదానితో సంబంధం లేకుండా చూస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజును ఒక్కో ఎంట్రీకి 10 అమెరికా డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.

రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు నేటినుంచి అమలులోకి వచ్చింది. ఫీజు చెల్లింపు ఆలస్యమైనా, తప్పులు దొర్లినా మీ అప్లకేషన్ చెల్లబోదు. 2025- 2026 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు, బకాయిల కోసం ప్రతిఒక్కరూ యుఎస్ సిఐఎస్ ఖాతాను తనిఖీ చేసుకోవాలి.
2025 మార్చి 7-24 తేదీల మధ్య రిజిస్టర్ చేసుకున్నట్లయితే, రిజిస్ట్రేషన్ ఫీజు 215 అమెరికా డాల్లర్లు చెల్లించ బడిందో లేదు నిర్థారించుకోవాలి. 2025 జనవరి 17 నుంచి కొత్త ఫామ్ 1-129 తప్పనిసరి అయింది. మిగతా వివరాలకు అమెరికా సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ శాఖ కొత్త నిబంధనలు చూడాల్సిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News