Wednesday, January 22, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న తొమ్మిది మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Habeeb nagar police arrested nine for selling drugs
నిందితుల్లో నలుగురు విద్యార్థులు
సౌదీలో ఏర్పడ్డ పరిచయం, సులభ సంపాదన కోసం వక్రమార్గం
అరెస్టు చేసిన హబీబ్‌నగర్ పోలీసులు

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న తొమ్మిది మంది నిందితులను హబీబ్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి నాలుగు ఎండిఎంఏ పిల్స్, ఎనిమిది స్మాల్ బాక్స్‌లోని హాష్ ఆయిల్, పది మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరానికి చెందిన ఫైసల్, రాహుల్ అలియాస్ నస్‌మాన్, దాన్‌వల్, ఎండి మిషబ్, ఎండి సల్మాన్, ఎండి సాహిద్, ఎండి ముసాదిక్ అహ్మద్, ఎండి అర్బాజ్ షేక్, షేక్ మహ్మద్ షఫీ, ఫీరోజ్ మహ్మద్, మహ్మద్ ఫరీస్, ఎండి అద్నాన్ సిద్దీఖీ కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితులు ఫైసల్, రాహుల్ అలియాస్ నస్‌మన్, దానువల్ పరారీలో ఉన్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని నిందితులు ప్లాన్ వేశారు.

ఇందులో భాగంగా డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశారు. డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటుపడ్డ నిందితులు వాటిని విక్రయించడం ప్రారంభించారు. ఫైసల్, దానువల్ వీరికి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. ఎండి మిషబ్, ఎండి సల్మాన్, ఎండి సయిద్, మహ్మద్ పరీస్ ఉన్నత చదువుల కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ డ్రగ్స్ విక్రయించేవారితో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించాలంటే డ్రగ్స్ విక్రయించాలని ముగ్గురు కలిసి ప్లాన్ వేశారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఫైసల్, దానువల్ నుంచి డ్రగ్స్, ఆష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఎస్సై సైదులు నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News