Wednesday, January 22, 2025

హబీబీ జిలేబీ.. మ్యూజిక్, విజువల్ ట్రీట్

- Advertisement -
- Advertisement -

రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్ ని లాంచ్ చేయడంతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైయింది. ఈ సందర్భంగా వెంకటేష్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీచరణ్ పాకాల మాస్, యూత్‌ను ఆకట్టుకునే పెప్పీ ట్రాక్ గా కంపోజ్ చేసిన ఈ పాట లీడ్ పెయిర్ డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్‌కి స్కోప్ ఇచ్చింది. రోషన్ కనకాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు.

పాపులర్ సింగల్ రాహుల్ సిప్లిగంజ్ తన హై-పిచ్ వోకల్స్ తో అదనపు ఎనర్జీని నింపారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పెప్పీ ట్రాక్ తెలుగు సినిమా ప్రేమికులకు మ్యూజిక్, విజువల్ ట్రీట్. మనసుని హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ‘బబుల్‌గమ్‘ చిత్రాన్ని రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News