హబ్సిగూడ: దంపతులు తన కూతురు, కుమారుడిని చంపి అనంతరం వారు ఉరేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కల్వకుర్తికు చెందిన చంద్రశేఖర్ రెడ్డి(45) తన భార్య కవిత(35), కుమారుడు విశ్వాన్ రెడ్డి(14), కుమార్తె శ్రీతరెడ్డి(15)లతో కలిసి హబ్సిగూడలో ఉంటున్నారు. ఓ ప్రైవేటు కాలేజీలో టీచర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల నుంచి ఉద్యోగం చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి.
కుమారుడికి విషమిచ్చి అనంతరం కూతురు ఉరేసి చంపారు. అనంతరం దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నారు. ఒయు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదు అని, వేరే మార్గం లేక తాము ఆత్మహత్య చేసుకున్నామని, క్షమించాలని, కెరీర్ లోనూ. శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, మధుమెహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతున్నానని సూసైడ్ నోట్ లో చంద్రశేఖర్ పేర్కొన్నారు. కల్వకుర్తి లో విషాదచాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.