Friday, December 27, 2024

తాజ్ హోటల్స్ కంప్యూటర్లపై హ్యాకర్ల దాడి

- Advertisement -
- Advertisement -

15 లక్షల మంది కీలక సమాచారం చోరీ

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రఖ్యాత తాజ్ హోటల్స్ కంప్యూటర్ వ్యవస్థపై హ్యాక ర్లు దాడి చేశారు. దాదాపు 15 లక్షల మంది కస్టమర్లకు చెందిన కీలక సమాచారాన్ని హ స్తగతం చేసుకున్నట్టు సమాచారం. ఈ డేటా చౌర్యానికి పాల్పడింది డీఎన్‌ఏ కుకీస్ అనే హ్యాకర్ల బృందంగా భావిస్తున్నారు. రూ. 4.16 లక్షలకు తాజ్ హోటల్స్ కస్టమర్ల డే టాను ఆ హ్యాకర్లు అమ్మకానికి పెట్టినట్టు వె ల్లడైంది. హ్యాకర్ల పాలైన సమాచారంలో చి రునామాలు, సభ్యత్వ ఐడిలు, మొబైల్ ఫోన్ నెంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజ్ గ్రూప్ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి దీనిపై స్పందించారు. కొంతమేర తమ కస్టమర్ల సమాచారం చోరీకి గురైందని వెల్లడించారు. చోరీకి గురైన డేటా ఏమంత ముఖ్యమైనది కాదని పేర్కొన్నారు. ఏదేమైనా కస్టమర్ల భ ద్రత తమకు  అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. డేటా చౌర్యంపై సంబంధిత అధికారులకు నివేదించామని వెల్లడించారు. తమ కంప్యూటర్ వ్యవస్థలను పరిశీలిస్తున్నామని, ఇది తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News