Saturday, April 26, 2025

పహల్ గామ్ దాడి వెనుక లష్కర్ చీఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పహల్గామ్ లోని బైసరాన్ లో టెర్రరిస్ట్ ల మారణ కాండకు పా ల్పడింది నిషేధిత లష్కరే తోయిబా గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న ఉగ్రవాద సంస్థ నిర్వహించింది. ఇందు లో ఎక్కువగా వీదేశీ టెర్రరిస్ట్ లే ఉ న్నారు. స్థానిక  టెర్రరిస్ట్ ల మద్దతుతో ఈ దాడి జరిగింది. నిజానికి ఈ మారణ కాండ వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నాడని వెల్లడైంది. అతడే 2008 టెర్రరిస్ట్ దాడి సూత్రధారి అన్నది తెలిసిందే. పహల్గామ్ లో మంగళవారంనాడు జరిగిన టెర్రరిస్ట్ ల హత్యాకాండలో 26 మంది పర్యాటకులు మరణించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంత దారుణమైన ఉగ్రవాద దాడి జరగడం ఇదే ప్రథమం. ఈ దాడితో కశ్మీర్ లోయలో చురుగ్గా పనిచేస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్ తొలిసారి బయటపడింది.

ఈ టెర్రర్ గ్రూప్ ను పాకిస్తానే ఆశ్రయం కల్పిస్తోందని వెల్లడి కావడంతో భారత ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. పాకిస్తాన్ లోని లష్కరేే తోయిబా కనుసన్నల్లో కశ్మీర్ వ్యాలీలో కొద్దికాలంగా చురుగ్గా ఉన్న ఈ ప్రత్యేక టెర్రర్ గ్రూప్ సోనామార్గ్, బూటా పాత్రి, గండర్ బాల్ తో సహా వ్యాలీలో జరిగిన దాడులను నిర్వహించిందని పేర్కొన్నారు. 2024 అక్టోబర్ లో బూటాపాత్రి లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో ఇద్దరు సైనికులతో సహా నలుగురు చనిపోయారు. అదేనెల సోనామార్క్ లో నిర్మాణ కార్మికులపై జరిగిన టెర్రర్ దాడిలో ఆరుగురు కార్మికులు ఒక డాక్టర్ చనిపోయారు. కశ్మీర్ వ్యాలీలిని ఈ కొత్త గ్రూప్ ను లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్, ఆయన డిప్యూటీ సైఫుల్లా పాకిస్తాన్ గడ్డ పై నుంచి నేరుగా నియంత్రిస్తున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News