Wednesday, January 22, 2025

హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాక్ యాంటీ టెర్రర్ కోర్టు !

- Advertisement -
- Advertisement -
Hafeez Saeed
2008 ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారికి రెండు కేసుల్లో శిక్ష విధింపు.  అతని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశం.

న్యూఢిల్లీ: లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చీఫ్, 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు శుక్రవారం 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నివేదికల ప్రకారం, సయీద్‌కు మరో రెండు ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో శిక్ష పడింది. అతడి ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఇలాంటి ఐదు కేసుల్లో, 70 ఏళ్ల ఈ రాడికల్ మత గురువుకు ఇప్పటికే 36 ఏళ్ల జైలు శిక్ష పడింది.

పంజాబ్ పోలీసుల ఉగ్రవాద నిరోధక విభాగం నమోదు చేసిన 21/2019 మరియు 90/2019 అనే రెండు ఎఫ్‌ఐఆర్‌లలో సయీద్‌కు యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ భుట్టర్ 32 ఏళ్ల జైలు శిక్ష విధించారని కోర్టు అధికారిని ఉటంకిస్తూ పిటిఐ  పేర్కొంది. “21/19 మరియు 99/21లో, అతనికి వరుసగా 15.5 సంవత్సరాలు మరియు 16.5 సంవత్సరాలు శిక్ష విధించబడింది” అని ఓ అధికారి తెలిపారు. సయీద్‌కు కోర్టు పాకిస్థాన్ రూ. 340,000  జరిమానా విధించింది.

2019 నుంచి కట్టుదిట్టమైన భద్రతలో జైలు శిక్ష అనుభవిస్తున్న సయీద్‌ను  లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. సయీద్‌ను అమెరికా ప్రత్యేకించి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా పేర్కొంది. అతను డిసెంబర్ 2008లో ఐక్యరాజ్య  భద్రతా మండలి తీర్మానం 1267 కింద కూడా దోషే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News