Monday, December 23, 2024

ఎనర్జిటిక్‌గా ‘ఒడియమ్మ..’

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, నాలుగో పాట ఒడియమ్మను వర్ధమాన్ కాలేజ్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌తో కలసి హీరో నాని వేదికపై ఒడియమ్మ పాటకు డ్యాన్స్ చేయడం కన్నులపండగలా అనిపించింది.

సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ పెప్పీ, లైవ్లీ , గ్రూవీ పార్టీ నెంబర్‌గా ఈ పాటని కంపోజ్ చేశారు. ఈ పాటలో నాని, శ్రుతి హాసన్ ఇద్దరూ తమ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్‌తో మైమరపించారు. ఈ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “ఇలాంటి ఎనర్జిటిక్ సాంగ్‌ని ఇంత ఎనర్జిటిక్ ఆడియన్స్ ముందు లాంచ్ చేయడం ఆనందంగా వుంది. డిసెంబర్ 7న హాయ్ నాన్న సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి”అని అన్నారు. ఈ వేడుకలో దర్శకుడు శౌర్యువ్, నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News