Monday, December 23, 2024

వడగండ్ల బాధితులకు అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాతో పాటు, జనగామ జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు జరిగిన భారీ పంట నష్టాలను వెంటనే రేపు రంగంలోకి దిగి అంచనా వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లా కలెక్టర్లను, సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ఏయే చోట్ల వడగండ్లు కురిసాయి? ఏ మేరకు ఏయే పంటలు నష్టాలకు గురయ్యాయి. ఎంత మంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది? పంట నష్టాలు ఎన్ని ఎకరాల్లో? ఎంత మేరకు నష్టపోయాయనే విషయాలపై మంత్రి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు.

అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం సాయంత్రం భారీగా గాలులు వీస్తూ కురిసిన వడగండ్ల వాన రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వడగండ్ల వానలకు నష్టపోయిన రైతాంగం ధైర్యంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడానని, పంట నష్టాల అంచనాలు వేశాక, తగిన విధంగ పరిహారం అందేలా చూస్తామని మంత్రి తెలిపారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి, పంట నష్టాల అంచానాలు వేయడంతోపాటు, రైతులకు ధైర్యం చెప్పాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News