మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు భయపెడుతున్నాయి. ఒక వైపు ఎండలు మండిపోతుండగా, మరో వైపు వడగండ్ల వానల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న 48గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5కి.మి ఎత్తు వద్ద ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48గంటల్లో తూర్పు, ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణలోని పలు జిల్లాల్లో తెలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని , గంటకు 40కి.మి వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంటంకటాపురంలో అత్యధికంగా 22.2మి.మి వర్షం కురిసింఒది. వికారాబాద్ జిల్లా దోమలో 19, బూర్గంపహడ్‌లో 14.2, పరిగిలో 12.4, సంగారెడ్డిలో 11, అశ్వారావుపేటలో 10.2, కొండుర్గ్‌లో 7.8, నవాబ్‌పేటలో 5, తొల్లాడలో 4.8, పినపాకలో 4.6, భద్రాచలంలో 3.2, మణుగూరులో 2.6, కొండాపూర్‌లో 2, సదాశివపేట, మొమిన్ పేట, గుండాల, మార్పల్లిలో ఒక్కొక్క మిల్లీమీటర్ వంతన వర్షం కురిసింది.
మరో వైపు రాష్టంలోని పలు జిల్లాల్లో ఎండలు కూడా భగ్గు మంటున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజమాబాద్‌లో 42.4,అదిలాబాద్ జిల్లాలో 42.3డిగ్రీల ఉష్ణో గ్రతలు నమోదయ్యింది. మెదక్‌లో 42.2, రామగుండంలో 42.2, నల్లగొండలో 41, మహబూబ్‌నగర్‌లో 40, హైదరాబాద్‌లో 39.3, హన్మకొండలో 39, ఖమ్మంలో 38.6, దుండిగల్‌లో 39.8, హకీంపేటలో 37.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Hailstorm and Rain in Next 48 hours in Telangana: IMD