ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన
బీభత్సం మామిడి తోటల్లో రాలిన
పూత, కాయలు నేలకొరిగిన వరి
చేలు నిజామాబాద్ మార్కెట్‌యార్డులో
తడిసిన పసుపు మొక్కజొన్న
పంట నేలపాలు కరీంనగర్ జిల్లా
చొప్పదండి మార్కెట్ యార్డులో
తడిసిన మొక్కజొన్న మెదక్‌లో
పిడుగుపాటుకు పాక్షికంగా దెబ్బతిన్న
ఇల్లు అధికారులు అప్రమత్తంగా
ఉండాలి : సిఎం రేవంత్ ఆదేశం
అవసరమైన సహాయక చర్యలు
అందించాలి : ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి శాంతికుమారి
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో /ఉమ్మడి కరీంనగర్ బ్యూరో/మెదక్ ప్ర తినిధి: తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉత్తర తెలంగాణలోని క రీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్‌తోపాటు నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన దంచి కొట్టింది. కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, జిల్లాల్లో భారీ వడగళ్ల వా న కురిసింది. మంచిర్యాల, కొరుముం భీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా లో వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాల, లక్సెట్టిపేట మండలంలో వర్షం తో పాటు ఈదురు గాలులు వీశాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. పెద్దపల్లి జిల్లా కేం ద్రంతో పాటు పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుండి సూ ర్యుడి ప్రతాపంతో జనం అల్లాడారు.
ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో వాతావర ణం ఒక్కసారిగా చల్లబడింది. పెద్దపల్లి మండలంతో పాటుగా ధర్మారం, రామగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ గా వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జి ల్లా, కోనరావుపేట మండలం, బావుసాయిపేటలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పంటలు తడవడంతో వరి, మామిడి రైతులు ఆందోళన చెందారు. పంట చేతికొచ్చే సమయంలో చెడగొట్టువాన దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పం ట నేలకొరిగింది. శుక్రవారం సాయం త్రం నాలుగు గంటల నుంచి కురిసిన వర్షానికి చేతికి అందే పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోయారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ని యోజకవర్గంలోని రోడ్లు జలమయమయ్యాయి. వర్షం ధాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు అన్నారు. ధర్మారం మండల కేంద్రంలో భారీ వర్షం కురుస్తూనే ఉంది. గత మూడు గంటలుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండగా… మామిడి తోటలకు అనువైన ప్రాంతమైన ధర్మారం మండలంలో ఈదురు గాలులతో పలుచోట్ల మామిడికాయలు నేలపాలయ్యాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వర్షం పడింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో అరబెట్టిన పసుపు కుప్పల్లోకి వర్షం నీరు చేరింది. లింగంపేట్ మండలం, లింగంపల్లిలో వడగళ్ల వానకు రెండు గేదెలు మృతి చెందాయి. ఈదురు గాలులకు చెట్లు విరిగి కరెంటు లైన్‌పై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దోమకొండ మండలం, సంగమేశ్వరులు బస్టాండ్ సమీపంలో వైరు తెగి కింద పడింది. దాంతో కరెంటు నిలిచిపోయింది. దోమకొండలో చెట్లు విరిగి ఎల్టీ లైన్‌పై పడటంతో లైన్ బ్రేక్ అయింది. ఎస్‌ఎస్ 58 సమీపంలో ఎల్‌టి లైన్ తెగి పడిపోయింది. దీంతో దోమకొండలో కరెంటుకు అంతరాయం కలిగింది. బీబీపేట రోడ్డులో చెట్లు విరిగిపడడంతో వాహనాదారులకు అంతరాయం కలిగింది. కరెంటు నిలిచిపోయింది. దోమకొండలోని హాస్పిటల్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ కొట్టుకొని పోయింది. రాజంపేట మండలంలో మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాజంపేట గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులుకు చెందిన మూడెకరాల మొక్కజొన్న పూర్తిగా నేలకొరిగి ధ్వంసమైంది.
మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని గూడెం, నంబాల, నర్సాపూర్, దండేపల్లి, కన్నెపల్లి, తదితర గ్రామాల్లో అరగంట పాటు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వరి పంట సాగు చేసిన రైతులు ఆందోళనకు గురయ్యారు. వరి పొలాలు పొట్ట దశలో, మరికొన్ని ఈనే దశలో ఉండడం వల్ల వరి తప్ప పోతుందని రైతులు దిగులు పడుతున్నారు. ముందుగా నాటు వేసిన వరి పొలాలు గొలక దశలో ఉండడంతో వడగండ్ల వర్షంతో వరి గింజలు రాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడితోటల్లో వడగండ్ల వర్షంతో పూత, పిందెలు రాలాయి. మున్సిపాలిటీ పరిధితోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం అనుకోని విధంగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి తడిసి రైతులకు తీవ్ర నష్టం చేకూరింది. పొట్ట దశలో ఉన్న వరి సైతం నేల వాలడంతో వరి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు.
మెదక్ జిల్లా, పెద్దశంకరంపేటలో శుక్రవారం సాయంత్రం దాదాపు 20 నిమిషాల పాటు ఓ మోస్తారు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ ఎక్కువగా ఉండటంతో ఎండ వేడిమికి గురైన ప్రజలు సాయంకాల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడటంతో పాటు దాదాపు 20 నిమిషాల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్త్తరు వర్షం కురిసింది. పెద్దశంకరంపేటలోని పాత గ్రామపంచాయతీ వార్డులో మురుగు నీరు రహదారిపై పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వాతవరణం చల్లబడటంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగింది. మెదక్ పట్టణంలో శుక్రవార సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జంబికుంట వీదికిలో డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. పిడుగు పాటుకు ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఇంటి యజమానులు ఊపీరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం వరకు ఎండతో కూడిన వాతావరణం ఒక్కసారిగా సాయంత్రం చల్లబడి వర్షం కురవడంతో పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. న్యాల్‌కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. యాసంగిలో భాగంగా నాటిన శనగ, జొన్న రైతులు మరోసారి నష్టపోక తప్పడంలేదు. ముందుగా నాటుకున్న కొందరు రైతులకు చెందిన పంటలు కోతలు రాసులు ముగిసి ధాన్యం ఇంటికి చేరినప్పటికీ మరికొందరి పంటలు కొతకు సిద్ధ్దంగా నేడో రేపో కోతలు కోసేందుకు సన్నద్ధం అవుతున్న తరుణంలో అకాల వర్షం నిరాశకు గురిచేసింది. టమాట, ఇతర కూరగాయల పంటల రైతులకు ఈ వర్షం తీవ్ర నష్టం కలిగించింది.