కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో వడగండ్ల వాన మండలంలోని రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో మండలంలోని పలు గ్రామాల్లో ఆరబోసిన మిర్చి పంట పూర్తిగా వర్షానికి తడిసి ముద్దయింది. రైతులు కల్లాల్లో వడగండ్ల వర్షానికి ఆరబోసిన మిర్చి కుప్పలు కొట్టుకుపోతుంటే దోమ తెరలు మరియు వలల సహాయంతో మిర్చి పంటను కాపాడుకోడానికి రైతుల చేసిన ప్రయత్నాలు వర్ణనాతీతం. పంట నష్టాన్ని అంచనా వేయవలసిన వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
స్తంభించిన విద్యుత్ వ్యవస్థ…
మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఏటూరునాగారం నుంచి కన్నాయిగూడెం వచ్చే 33కేవీ విద్యుత్ లైన్ల పైన భారీ వృక్షాలు పడతంలో అంధకారంలోనే మండలం ఉండి పోయింది.మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ వైర్లు తెగిపోయి వేలాడుతూ కనిపించడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన విద్యుత్ అధికారులు కరెంటును పునరుద్దించే పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో ఇంటర్ నెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే బూస్టర్స్ కింద పడి పూర్తిగా పగిలి పోవడం జరిగింది.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : చిలకమరి శ్రీనివాస్
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికి వచ్చి మిర్చి పంట వరద నీటిలో కొట్టుకు పోవడం జరిగిందని గూర్రేవుల గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తాను 5ఎకరాల వరకు మిర్చి పంట వేయడం జరిగిందని, తక్షణమే వ్యవసాయ అధికారులు సర్వే చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
మండుటెండల్లో వడగండ్ల వాన బీభత్సం
- Advertisement -
- Advertisement -
- Advertisement -