హైదరాబాద్ : హజ్ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాల సమర్పణకు గడువును కేంద్ర హజ్ కమిటీ పొడిగించింది. ఈ నెల 4 నుండి ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు గడువు నేటితో ముగిసింది. ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నందున దరఖాస్తు ఫారాల సమర్పణకు చివరి తేదీని జనవరి 15, 2024 వరకు పొడిగించినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హజ్ కమిటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి లియాఖత్ అలీ ఆఫాఖి సూచించారు.
జనవరి 31, .2025 వరకు చెల్లుబాటు అయ్యే మెషిన్ రీడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న దరఖాస్తుదారులు జనవరి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. హజ్ దరఖాస్తును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ https://hajcommittee.gov.inలో ఆన్‌లైన్‌లో నింపాలని సూచించారు. దరఖాస్తుదారులందరూ తమ హజ్ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించే ముందు జాగ్రత్తగా హజ్ మార్గదర్శకాలు- పాటించాలని సూచించారు.