Sunday, April 6, 2025

హజ్ క్యాంప్ విజయవంతం, సహకరించిన అధికారులకు ధన్యవాదాలు : సలీం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గత 20 రోజులుగా కొనసాగిన హజ్ క్యాంప్ విజయవంతంగా ముగిసిందని హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ సలీం ఇంచార్జి ఎగ్జిక్యూటివ్ అధికారి లియాఖత్ హుస్సేన్ తెలిపారు. హజ్ క్యాంప్ విజయవంతానికి సహకరించిన వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా పోలీసు, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎమ్‌డబ్లుఎస్, ట్రాన్స్‌కో, డిఎంహెచ్‌ఓ, హార్టికల్చర్, ఎయిర్‌పోర్ట్, హోమ్ గార్డ్, విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, వాలంటీర్లు హజ్ క్యాంప్ 2023 ను విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. హజ్ గురించి మంచి కవరేజి ఇచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరు కలిసి పనిచేయడం వల్లే హజ్ క్యాంప్ విజయవంతం అయ్యిందని సలీం చెప్పారు. వాలంటీర్లు కూడా బాగా పనిచేశారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాగే సహకారాన్ని అందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News