హైదరాబాద్ : తెలంగాణ హజ్ కమిటీ ద్వారా హజ్‌కు వెళ్ళేందుకు ఎంపికైన యాత్రికులు రెండవ విడుత హజ్ రుసుము రూ. 1,70,000 లు చెల్లించేందుకు గడువును ఈ నెల 28 కు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర హజ్ కమిటీ సర్కూలర్ జారీ చేసిందని రాష్ట్ర హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ సలీం, ఎగ్జిక్యూటివ్ అధికారి బి. షఫిఉల్లా ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి గడువు ఈ నెల 24తో ముగిసింది.
సెలవులు, ఇత్యాది కారణాల వల్ల రెండో విడుత హజ్ రుసుము చెల్లించని యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని సూచించారు. వెయిటింగ్ లీస్ట్‌లో ఉన్న తొలి 1200 మంది హజ్ యాత్రికులు తమ ఒరిజినల్ పాస్ పోర్టు (ఫొటో కాపీతో సహా), కేంద్ర హజ్ కమిటి వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫాం, మెడికల్ ఫిట్నెట్ సర్టిఫికెట్, కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్, బ్యాంకు వివరాలు మే 1వ తేదీ వరకు నాంపల్లిలోని రాష్ట్ర హజ్ కమిటి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 04023298793 నెంబర్‌కు కార్యాలయ పనివేళల్లో సంప్రదించవ్చని తెలిపారు.