రియాద్: వచ్చే నెల హజ్ పవిత్ర యాత్ర కోసం సౌదీ అరేబియాకు వచ్చే యాత్రికులకు సౌదీ అరేబియా మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాలు సోమవారం నుంచి మొదలయి జూన్ 26 వరకు ఉంటాయి. నిషిద్ధాలు, కస్టమ్స్ చట్టాలకు సంబంధించి పవిత్ర యాత్రికులకు నియమనింబంధనలు తెలుపుతూ సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. పవిత్ర యాత్ర సునాయాసంగా సాగేందుకు ఈ మార్గదర్శకాలను ఉద్దేశించారు.
పవిత్ర యాత్రికులు అవసరమైన అధికారిక డాక్యుమెంట్లను తీసుకు రావల్సి ఉంటుంది. వారు సౌదీ అరేబియా విమానాశ్రయంలో దిగగానే ప్రయాణ ప్రొసీజర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏవేని ఎలెక్ట్రానిక్ పరికరాలుంటే వాటిని తనిఖీ చేసిన బాగేజీలోనే ఉంచాల్సి ఉంటుంది.
లగేజీకి సంబంధించిన ప్రతిదీ అనుమతించిన సైజులోనే ఉండాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. లగేజీకి యునిక్ ఐడెంటిఫికేషన్ ట్యాగులు అఫిక్స్ చేయాలని సిఫార్సు చేసింది. కస్టమ్స్ డిక్లరేషన్ పూర్తి చేసి సంతకం చేయని యాత్రికులు జవాబుదారులవుతారు!
హజ్ పవిత్ర యాత్ర అనేది స్తోమత ఉన్న ప్రతి ముస్లిం జీవిత కాలంలో ఒక్కసారైనా చేయాల్సిన పవిత్ర యాత్ర. స్తోమత అంటే ఇక్కడ శారీరకంగా, ఆర్థికంగా యాత్ర నిర్వహించే స్థాయి. ఈ ఏడాది హజ్ యాత్ర జూన్ 26 నుంచి మొదలు కానున్నది. ఈసారి కొవిడ్ నియమనిబంధనలు 19 లేనందున పెద్ద సంఖ్యలో పవిత్ర యాత్రికులు సౌదీ అరేబియాకు చేరుకుంటారని సమాచారం.
Avoid carrying prohibited luggage when you travel. #Proclaim_to_the_People#Makkah_and_Madinah_Eagerly_Await_You pic.twitter.com/taOas7mLJA
— Ministry of Hajj and Umrah (@MoHU_En) May 24, 2023
Upon entry and departure #In_Peace_and_Security, please make sure to fill in the customs declaration.#Proclaim_to_the_People#Makkah_and_Madinah_Eagerly_Await_You pic.twitter.com/a7N5DLWZYg
— Ministry of Hajj and Umrah (@MoHU_En) May 24, 2023