Monday, December 23, 2024

ఈ నెల 15 నుండి హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం : చైర్మన్ సలీం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హజ్ యాత్ర పూర్తి చేసుకొని రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు ఈ నెల 15 నుండి తిరుగు ప్రయాణం అవుతున్నారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం తెలిపారు. ఈ నెల 15 నుండి 30 వ తేదీ వరకు రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. మక్కాలో ఉన్న హజ్ యాత్రికుల తొలి బృందం గురువారం మదీనా చేరుకుందన్నారు. అక్కడ వారం రోజులు ప్రార్థనల్లో గడిపి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారన్నారు.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హజ్ యాత్రికుల ఆగమనం సందర్భంగా స్వాగతం పలికేందుకు వెళ్లే కుటుంబ సభ్యులకు అక్కడ ఏర్పాట్లను చైర్మన్ మొహమ్మద్ సలీం, ఇంచార్జి ఎగ్జిక్యూటివ్ అధికారి లియాఖత్ హుస్సేన్, కస్టమ్స్, జిఎంఆర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సంవత్సరం తెలంగాణ హజ్ కమిటీ ద్వారా 5,583 మంది యాత్రికులు హజ్‌కు వెళ్ళగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొత్తం 7,060 మంది హజ్ కు వెళ్ళినుట్ల తెలిపారు. వారిలో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలోని పలు ప్రాంతాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు.
మక్కాలో తెలంగాణ యాత్రికుడి మృతి
హజ్ యాత్రకు వెళ్ళిన రంగారెడ్డి జిల్లా వాసి షేక్ రసూల్ (72) బుధవారం అర్థరాత్రి మక్కాలో మృతి చెందారు. భార్య, కుమార్తె , అల్లుడితో కలిసి జూన్ 19న ఆయన రాష్ట్ర హజ్ కమిటి ద్వారా హజ్ యాత్రకు వెళ్లారు. ఆయన అంత్యక్రియలు గురువారం మక్కాలో జరిగినట్లు హజ్ కమిటీ అధికారులు తెలిపారు. కాగా షేక్ రసూల్ మృతి పట్ల హజ్ కమిటీ చైర్మన్ సలీం, ఇంచార్జి ఈఓ లియాఖత్ హుస్సేన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News