Wednesday, January 22, 2025

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో లైంగిక వేధింపులు.. ఓఎస్డీ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డి హరికృష్ణను సస్పెండ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి నివాస్ గౌడ్ స్పందించారు. ఈ ఘటనపై పత్రికలో వచ్చిన వార్తపై విచారణ జరపాలని ఆదేశించామని, మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆరోపణలు వచ్చిన అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని మంత్రి తెలిపారు. ఈరోజు ఉదయం 7 గంటలకు విషయం తెలిస్తే అప్పుడే చర్యలు తీసుకున్నామన్నారు.

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేదిలేదని.. ఆరోపణలు నిజమైతే జైలుకు పంపిస్తామని, అవరసమైతే ఉరి తీయిస్తామని తెలిపారు. ఈ ఘటనపై మాకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News