Saturday, November 16, 2024

Sieger Technologiesతో Hala Mobility భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ-మాస్ EV Fleet ప్లాట్ ఫారమ్ లో అప్రతిహతంగా దూసుకుపోతున్న హలా మొబిలిటీ… ప్రముఖ లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ సంస్థ Sieger Technologiesతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2026 నాటికి

హైదరాబాద్ లో 18,000 టు EV 2 వీలర్స్ ను మార్కెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిద్వారా మొదటి విడతగా హలా మొబిలిటీ 2000 E2Wలను అందించేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అంటే 2026 నాటికి 18,000 E2Ws అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాతి రోజుల్లో చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, ముంబై మరియు పూణే లాంచి వంటి ఇతర ప్రధాన భారతీయ నగరాలకు విస్తరించబోతున్నారు.

ఈ భాగస్వామ్యం… ఈవీ ఛార్జింగ్ కు సంపూర్ణ పరిష్కార మార్గాలను సూచిస్తుంది. దీంతోపాటు Sieger యొక్క అధునాతన బ్యాటరీ సాంకేతికత ద్వారా, హలా మొబిలిటీ బ్యాటరీ స్వాప్ సామర్థ్యాలు, వేగవంతమైన ఛార్జ్/డిశ్చార్జి, పొడిగించిన లైఫ్ సైకిల్ నుండి దాని ఫ్లీట్ విస్తరణల అత్యుత్తమ ప్రయోజనాలను అందిస్తుంది.

యాప్-ఆధారిత సేవల ప్లాట్‌ఫారమ్‌తో పాటు, పలురకాల విభిన్నమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తుంది హలా మొబిలిటీ. తద్వారా వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడే అనేక రకాల ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ పోర్టేషన్‌లను సజావుగా ఎంచుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది.

ఈ సందర్భంగా హలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “Halaలో, మేము ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సేవలను మరింత మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు సౌలభ్యం, సౌకర్యం, ప్రాధాన్యతనిచ్చే సాంకేతికతతో కూడిన అత్యాధునిక పరిష్కారాల కోసం ప్రతీక్షణం అన్వేషిస్తూనే ఉంటాం.

“కేవలం 40 నిమిషాల్లో తమ ఈవీలను 80% వరకు ఛార్జ్ చేసే టెక్నాలజీ ఇప్పుడు రైడర్ లకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. తద్వారా ఎలాంటి టెన్షన్ లేకుండా వినియోగదారులు తమ వాహనాలను రైడ్ చేసుకోవచ్చు, మెరుగైన మైలేజ్ ద్వారా ఆర్థికంగా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా పొడిగించిన బ్యాటరీ లైఫ్‌తో సమర్థవంతమైన 2W పరిష్కారం కూడా లభిస్తుంది. ఈ సహకారాలు మా ప్లాట్‌ఫారమ్ యొక్క యాక్సెసిబిలిటీ, రీచ్‌ను పెంచడమే కాకుండా వినియోగదారులకు స్థిరమైన మొబిలిటీ ఎంపికలను మరింత ఆకర్షణీయంగా, ఆచరణాత్మకంగా చేయడానికి కూడా దోహదం చేస్తాయి”అని శ్రీకాంత్ తెలిపారు.

Sieger యొక్క Gen 2.0 ర్యాపిడ్ చార్జ్ బ్యాటరీలు వాటి స్థిరత్వానికి, వ్యయ తగ్గింపునుకు ప్రసిద్ధి పొందినవి. దీనిద్వారా పరిశ్రమలో గణనీయమైన పురోగతి లభిస్తుంది. ఈ సరికొత్త సాంకేతికత ఒక కొత్త పనితీరు ప్రమాణాన్ని, యాజమాన్యం, మొత్తం ఖర్చును నిర్ధారిస్తుంది.

ఈ సందర్భంగా Sieger Technologies ఎండీ గురు ప్రశాంత్ మాడెం మాట్లాడుతూ… “విశ్వసనీయత, స్థోమత, ఎలక్ట్రిక్ మొబిలిటీ సెక్టార్‌లో వారికున్న అనుభవం దృష్ట్యా మేము హాలా మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాము. Hala మొబిలిటీ యొక్క వినూత్న E-MaaS ప్లాట్‌ఫారమ్ E- మొబిలిటీ స్పేస్‌ని విప్లవాత్మకంగా మార్చే మా లక్ష్యంతో మరింత ముందుకు వెళ్తోంది. ఈ భాగస్వామ్యం మా ఎఫిషియెంట్ Gen 2.0 ర్యాపిడ్ ఛార్జ్ లిథియం-అయాన్ బ్యాటరీలను స్కేల్‌లో అమర్చడానికి అనుమతిస్తుంది. ఇది 20% నుంచి 80% బ్యాటరీ ఛార్జ్ ని కేవంల 40 నిమిషాల్లో అందిస్తుంది. తద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ పరిష్కారాలను అందించేందుకు దోహదపడుతుంది. దీనిద్వారా హలా మొబిలిటీతో కలిసి భారతదేశంలో విద్యుత్ రవాణా భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలమని మేము విశ్వసిస్తున్నాము అని అన్నారు ఆయన.

ఇటీవలి అధ్యయనాల ప్రకారం, నగరంలో EV 2-వీలర్లను విస్తృతంగా స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి మరింత సౌకర్యవంతంగా ఉండే ఛార్జింగ్ పాయింట్లు/స్వాపింగ్ స్టేషన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. EVలకు ఎలాంటి ఇబ్బందులు లేని సేవలను అందించేందుకు, ప్రస్తుతం చార్జింగ్ సేవలను మరింత వేగంగా, ఫాస్ట్ గా అందించేందుకు సీగర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News