Saturday, November 23, 2024

మారుతి సుజుకి కోహోర్ట్ ను గెలుచుకున్న హాలా మొబిలిటీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి ఎప్పుడూ ముందు ఉంటుంది. అందులో భాగంగానే కొత్త స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు మొబిలీట స్టార్టప్స్ కోసం ఒక ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు నిర్వహించిన ఈ కార్యక్రమం రెండొవది. ఈ రెండో కోహోర్ట్ కార్యక్రమంలో హలా మొబిలిటీ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని నడత్తూర్ S. రాఘవన్ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూరియల్ లెర్నింగ్ (NSRCEL), స్టార్టప్ హబ్ అయినటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు (IIM-బెంగళూరు) భాగస్వామ్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమం ద్వారా మారుతి సుజుకి విస్తారమైన టెస్ట్ బెడ్‌ను ఉపయోగించుకుని సరికొత్త పరిష్కారాలను కలిసి సృష్టించేందుకు, MSIL వ్యాపార బృందాల కలిసి పనిచేసేందుకు హలా మొబిలిటీకి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మారుతి సుజుకితో చెల్లింపు ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్‌ను చేపట్టడానికి హలా మొబిలిటీకి అవకాశం లభిస్తుంది. స్టార్టప్‌లు తమ ప్రయత్నాలను చానలైజ్ చేయడంలో సహాయపడటానికి ఒక ఆటోమొబైల్ తయారీ అందించే ఒక అద్బుతమైన అవకాశం ఇది. తద్వారా రియల్ టైమ్ ఇండస్ట్రీ వ్యాపార బృందాలతో పని చేసే అద్బుతమైన అవకాశం లభిస్తుంది. దీనిద్వారా ఇండస్ట్రీకి కావాల్సిన రియల్ టైమ్ సొల్యుషన్స్ ను అందించే ప్రయత్నం చేయవచ్చు.

ఈ కోహోర్ట్ ఇంక్యుబేషన్ కార్యక్రమం కోసం దాదాపు 300 ఇతర అప్లికేషన్‌లు వచ్చాయి. మారుతీ సుజుకి, NSRCEL టాప్ 8 ఎర్లీ స్టేజ్ స్టార్టప్ లను ఎంచుకున్నారు. ఈ ఎంచు కోవడం కూడా టీమ్ ఆప్ ఎక్స్ పర్ట్స్ ద్వారా జరిగింది. ఇందులో హలా మొబిలిటీ 6-నెలల ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కోసం అర్హత పొందింది. IIM-బెంగళూరులోని అద్బుతమైన క్యాంపస్‌లో చివరి డెమో డే నిర్వహించబడింది. 8 షార్ట్‌లిస్ట్ అయిన స్టార్టప్‌లు, వాటి తాలూకు వ్యక్తులు హాజరయ్యారు, వీటిలో హాలా మొబిలిటీ ఎంపికైన 3 విజేతలలో ఒకటిగా నిలిచింది. మిగిలిన ఇద్దరు విజేతలు టెక్ స్పేస్‌కు చెందినవారు, వరుసగా మహిళా పరిశుభ్రత, నాణ్యత తనిఖీపై వారు దృష్టి పెట్టారు.

ఈ సందర్భంగా హలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. షార్ట్‌లిస్టింగ్ ప్రతి దశలో మారుతి సుజుకి బృందం నుంచి మాకు తిరుగులేని మద్దతు లభించింది. మేము మారుతి సుజుకి, అకాడెమియా మరియు పరిశ్రమతో అనుబంధంగా ఉన్న డొమైన్ నిపుణుల నుండి సమగ్ర శిక్షణ, మార్గదర్శకత్వం పొందాము. అంతేకాకుండా ఈ సందర్బంగా వెంచర్ క్యాపిటలిస్టులు అందించిన మార్గదర్శకత్వాన్ని మేం అస్సలు మర్చిపోలేం. ఇది ప్రోగ్రామ్ పెట్టుబడిదారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు మాకు అవకాశాలను మరింత సులభతరం చేసింది, చివరికి మా మార్కెట్ యాక్సెస్‌ కూడా దీని ద్వారా విస్తరించింది అని అన్నారు ఆయన.

లక్ష్యాలను అందుకోవడంలో, అందులో భాగంగా వచ్చే పరిష్కారాలను మెరుగుపరచడంలో, మైక్రో-మొబిలిటీ ప్రదేశంలో వాటిని అమలు చేయడంలో ఈ కార్యక్రమం హలా మొబిలిటీకి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు శ్రీకాంత్. దీనిద్వారా హలా మరింత అభివృద్ధి అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ నుంచి అభిప్రాయాలను పొందేందుకు వీలు కలుగుతుంది. దీంతోపాటు వినియోగదారుల సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు, ఎలాంటి ఇబ్బందులు లేని పరిష్కార మార్గాలను వినియోగదారులకు అందించేందుకు ఈ అవకాశం అనుమతినిస్తుంది.

హలా మొబిలిటీ అనేది E-MaaS మల్టీ-మోడల్ ప్లాట్‌ఫారమ్. ఇది భారతదేశంలో ఈవీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈవీ ఆధారిత పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది హలా. విభిన్న శ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలను అందించడం ద్వారా, సహజమైన యాప్-ఆధారిత ప్లాట్‌ఫారమ్‌తో పాటు, వినియోగదారులకు వారి అవసరాల ఆధారంగా అనేక రకాల ఎలక్ట్రిక్ రవాణా మార్గాలను సజావుగా ఎంచుకునేందుకు అధికారం కల్పిస్తారు. విశ్వసనీయత, స్థోమత, ప్రాప్యత లాంటి లక్షణాల ద్వారా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ లో మరింత విస్తరించాలని భావిస్తోంది హలా. దీంతో రాబోయే రోజల్లో మరిన్ని నగరాల్లో హలా తమ వ్యాపార అభివృద్ధికి ప్లాన్ చేస్తోంది.

వినూత్న ఆఫర్లుతో పాటు, ప్రధాన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులతో, ఛార్జింగ్‌ వ్యాపారవేత్తలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడంలో హలా గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఈ సహకారం ద్వారా మరింత యాక్సెసిబిలిటీని, రీచ్‌ పెంచుకునేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది హలా. తద్వారా వినియోగదారులు స్థిరమైన మొబిలిటీ ఎంపికలను స్వీకరించడాన్ని ఇది సులభతరం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News