Sunday, December 22, 2024

రంజాన్ మాసపు ప్రత్యేక వంటకం

- Advertisement -
- Advertisement -

రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైన నెల. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన నెలగా చెప్తారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షలు చేసి పేదలకు దాన ధర్మాలు చేస్తారు. దీనినే జకాత్ అంటారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక. ముస్లింలతో పాటు హిందువులు కూడా రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తుంటారు. రంజాన్ మాసంలో అనేక అరేబియన్, మొఘలాయి వంటలు ప్రత్యేకంగా చేస్తారు. అన్ని అరేబియన్, మొఘలాయి వంటలలో ప్రజలకు ఎక్కువగా ఆకట్టుకునేది, ఆకర్షణీయమైనది, రంజాన్ మాసంలో అందుబాటులో ఉండేది ‘హలీమ్’. హలీమ్ ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా తింటారు. చిన్న పిల్లలు, వృద్ధులు, ఇంటిల్లిపాది రుచికరమైన వంటకం ‘హలీమ్’ను అభిమానిస్త్తూ తింటారు.

‘హలీమ్‘తయారీ: ‘హలీమ్’ను తయారు చేయడానికి హోటల్ యజమానులు లేదా ‘హలీమ్’ విక్రయదారులు ప్రత్యేకమైన బట్టీలను తయారు చేస్తారు. రంజాన్ నెల పూర్తయి రంజాన్ పండుగ రోజు ‘హలీమ్’ బట్టీలను కూల్చివేస్తారు. రాత్రి పెద్ద, పెద్ద డెకీసాలలో గోధుమలు, మాంసం, ప్రత్యేకమైన దినుసులు వేసి బాగా ఉడికిస్తారు. ఉదయం లేవగానే దానిని మెత్తగా దంచుతారు. మెత్తగా చేసిన తర్వాత నెయ్యి, మసాలాలు, ఉల్లిగడ్డ, కొత్తిమీరను కలిపి అమ్ముతారు. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కాబట్టి హిందూ, ముస్లిం సోదరులు పెద్ద పెద్ద లైన్లను కట్టి సాయంత్రం పూట తింటారు. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నోరూరించేది ‘బిర్యానీ’. ‘బిర్యానీ’ తర్వాత రంజాన్ మాసంలో హైదరాబాద్ ‘హలీమ్’ కు ప్రసిద్ధి. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ‘బిర్యానీ’ చాలా ప్రసిద్ధి.

దేశ, విదేశీయులు, సినీ, రాజకీయ, క్రీడాకారులు, ఏదైనా ఉద్యోగ రీత్యా, సెమినార్‌లో రీత్యా హైదరాబాద్‌కు వస్తే హైదరాబాద్ ‘బిర్యానీ’ రుచి చూడనిదే వెళ్ళరు. అదే విధంగా గ్రామాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి వివిధ దేశాల నుండి వచ్చే ప్రముఖులు రంజాన్ మాసంలో ‘హైదరాబాద్ బిర్యానీ’ తో పాటు ‘హలీమ్’ ను కూడా తింటారు. ఈ విధంగా ‘హలీమ్’ అందరి మన్ననలు పొందింది. ‘హలీమ్’లో వాడే దినుసుల వలన పుష్టికరమైన పోషకాహారంగా కూడా రంజాన్ మాసంలో తింటుంటారు. ఈ మధ్య హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి పెళ్లి, విందు వినోదాలలో కూడా ‘హలీమ్’ ను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో కూడా ప్రజలు ‘హలీమ్’ తినడానికి మక్కువ చూపుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News