Sunday, November 17, 2024

సొంత రాష్ట్రంలోనూ ట్రంప్ చేతిలో హేలీ పరాజయం

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ట్రంప్ తో పోటీ పడుతున్న నిక్కీ హేలీ తన సొంత రాష్ట్రమైన దక్షిణ కరొలీనాలో ఓడిపోయారు. ఇప్పటికే నెవడా, వర్జిన్ ఐలాండ్స్, న్యూ హాంప్ షైర్, ఐయోవాలలో గెలిచిన ట్రంప్, తాజాగా దక్షిణ కరోలినాలోనూ జయకేతనం ఎగురవేశారు. ట్రంప్ కు 63 శాతం ఓట్లు రాగా, హేలీకి 36.8 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన నిక్కీ హేలీ గతంలో దక్షిణ కరొలినా గవర్నర్ గా రెండు పర్యాయాలు పనిచేశారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ నుంచి హేలీ తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తుండగా హేలీ మాత్రం ససేమిరా తప్పుకోనంటున్నారు. పలు రాష్ట్రాల్లో మార్చి ఐదవ తేదీన జరిగే ప్రైమరీల్లోనూ తాను పోటీలో ఉంటానని హేలీ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News